Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గువాహటి నైట్‌క్లబ్‌లో దారుణం.. మహిళను వివస్త్రను చేసి దాడి!

Guwahati nightclub horror woman stripped and attacked by bouncers
Advertisement
  • దాడిలో బౌన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియోలు
  • పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
Advertisement
అసోం రాజధాని గువాహటిలోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖానాపారా ప్రాంతంలోని 'లోకల్స్' కేఫ్ అండ్ లాంజ్‌లో గురువారం రాత్రి ఓ మహిళను వివస్త్రను చేసి, అమానుషంగా దాడి చేశారు. ఈ దాడిలో క్లబ్ బౌన్సర్లు కూడా పాల్గొన్నట్లు అక్కడున్న వారు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో బాధితురాలు బట్టలు లేకుండా నేలపై పడి ఉండగా, ఇద్దరు మహిళలు ఆమెను కాలితో తన్నడం స్పష్టంగా కనిపించింది. వారి పక్కనే కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. క్లబ్‌లోని నాలుగో అంతస్తు నుంచి ఆమెను బలవంతంగా కింద పార్కింగ్ ప్రాంతానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, క్లబ్‌లో ముందుగా ఆమెను నేలపైకి తోసేసి, బట్టలు విప్పి దాడి చేశారు. ఈ దాడిలో స్త్రీ, పురుష బౌన్సర్లు ఉన్నారని అంటున్నారు. అయితే ఈ గొడవకు దారితీసిన కారణాలు, దాడికి ముందు ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. బాధితురాలి వివరాలు కూడా తెలియరాలేదు.

ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు నైట్‌క్లబ్‌కు వెళ్లగా, అది మూసివేసి ఉంది. క్లబ్ యాజమాన్యం నుంచి ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement
Locals Cafe and Lounge
Guwahati nightclub attack
Woman stripped in Guwahati
Khanapara crime news

More Telugu News